ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు
ముందుగా బొట్టుపెట్టుకుని, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్థించుకోవాలి.
ప్రార్థన :
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు ॥
శ్లో॥ తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతేతేంఘ్రి యుగంస్మరామి ॥
సుముహూర్తోస్తు ॥
శ్లో॥ లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః ।
యేషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః ॥
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమా మ్యహం ॥
సుమఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః,
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః । «
దూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః,
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః ।
అష్టావష్టౌ చ నామాని యః పఠేచ్ఛృణుయాదపి ।
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే।
అభీప్సితార్థ సిద్ధర్థ్యం, పూజితో యస్సురైరపి,
సర్వవిఘ్నచ్ఛి దేతస్మై గణాధిపతయే నమః ॥
(నమస్కరించుకుని ఆచమనము – ప్రాణాయామము చేసి ఈ విధంగా సంకల్పము చెప్పుకోవాలి)
సంకల్పం :
ఓం ॥ మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీవిజయ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ఇందువాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ ….గోత్రః …. నామధేయః, శ్రీమతః ….గోత్రస్య ….నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి.
పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే ।
తదంగ కలశపూజాం కరిష్యే ॥
కలశపూజ:
కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య । తస్యోపరి హస్తం నిధాయ (కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ ఈ మంత్రం చదవాలి)
కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణుసమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాస్మృతాః,
కుక్షౌతుసాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ॥
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః (మన వద్ద వున్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకు వుంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్ధతిలో తిప్పాలి)
॥శ్లో॥ గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.
విఘ్నేశ్వర పూజ
గణానాంత్వాం గణపతిగ్ం హవామహే, కవిం కవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం॥
శ్రీ మహాగణాధిపతయే నమః ॥
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (మధ్య వేలితో నీటిని తాకాలి)
ధ్యానం :
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అనే శ్లోకం చదువుతూ పూవులూ అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాల చెంత వుంచాలి. పూజను దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు)
ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి
(అని చెబుతూ ఉద్ధరిణతో నీటనీ పసుపు గణపతికి చూపించి ఆ నీటిని చిన్న పళ్ళెం లేదా పాత్రలో వేయాలి.
పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరు వత్తులు వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యం పెట్టి శోడశోపచార పూజ చేయాలి.
యధాభాగం గుడం నివేదయామి ॥ శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు ॥ శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి
అంటూ పూజ చేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి.
మరలా ఆచమానం చేసి పైన సూచించిన విధంగా సంకల్పం చెప్పుకోవాలి.
అథః శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే-
అంటూ కుటిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.
శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ :-
(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి)
ఓం ఆంహ్రీంక్రోం యంరంలంవం శంషంసంహం – ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా (నమస్కారం చేస్తూ) ॥ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శ్లో॥ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు॥
అవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)
షోడశోపచార పూజ :
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ॥
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్ ॥
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥ «
ద్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥
శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి॥ (వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి)
అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ.
ఆవాహయామి॥ (మరల అక్షతలు వేయాలి)
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఆసనం సమర్పయామి ॥ (అక్షతలు లేదా పూలు వేయాలి)
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్
అర్ఘ్యం సమర్పయామి॥ (ఉద్ధరెణతో నీరును స్వామికి చూపించి పక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి)
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
పాద్యం సమర్పయామి॥ (మరలా కొంచె నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి)
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో
ఆచమనీయం సమర్పయామి॥ (కొంచె నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి)
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
మధుపర్కం సమర్పయామి॥ (స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.)
స్నానం :
పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
పంచామృత స్నానం సమర్పయామి॥
(ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి)
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః
స్నానం కురుష్వభగవన్వుమాపుత్ర నమోస్తుతే
శుద్ధోదక స్నానం సమర్పయామి॥
(కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి॥
(స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్లయితే పత్తికి పసుపు, కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు)
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్
గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
ఉపవీతం సమర్పయామి॥
(యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
గంధం సమర్పయామి॥
(కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్
శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
అక్షతాన్ సమర్పయామి॥
(స్వామికి అక్షతలు సమర్పించాలి)
సుగన్ధాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ
యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే
పుష్పాణి పూజయామి॥
(స్వామిని పూలతో పూజించాలి)
అధ అంగపూజ
గణేశాయ నమః పాదౌ పూజయామి॥ ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, శూర్ప కర్ణాయ నమః జానునీ పూజయామి, విఘ్న రాజాయ నమః జంఫౌ పూజయామి, ఆఖు వాహనాయ నమః ఊరూం పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోద రాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయనమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయనమః స్కందౌపూజయామి, పాశహస్తాయ నమః హస్తౌపూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రంపూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరఃపూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి॥
పూజకు కావలసిన సామగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమల పాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యిలేక నూనె, దీపారాధన వత్తులు. వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు.
చిన్నారి దేవుళ్ళ పండుగ
వినాయక పూజా విధానం చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుంది. వారికి పూజా విధానం, మన ఆచార సంప్రదాయాలు నేర్పేందుకు ఇది చక్కని అవకాశం. వివిధ రకాల ఆకులతో దేవుడ్ని పూజించడం ద్వారా వారికి ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వీలుంది. చిన్నారులకు వీలుంటే రోజూ వేసుకొనే దుస్తులకు భిన్నమైన బట్టలు వేస్తే వారికి వినాయకచవితి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. ఒకటి, మూడు, ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసి, పూజలో వుంచి దానిని పిల్లలు, పెద్దలు అందరూ ధరించవచ్చు.
పూజా సన్నాహం
వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.
వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.
అథ ఏకవింశతి పత్ర పూజ
(ఒక్కొక్క నామం చదువుతూ బ్రాకెట్‌లో పేర్కొన్న పత్రాలు తీసుకుని స్వామిని పూజించాలి)
ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగి)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణు)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంతం)
ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (గండకీ)
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతపత్రాణి పూజయామి.
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిః
(ఈ క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం దైవమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిథయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః,
ఓం లంబజఠరాయ నమః,
ఓం హ్రస్వగ్రీవాయ నమః,
ఓం మహోదరాయ నమః,
ఓం మదోత్కటాయ నమః,
ఓం మహావీరాయ నమః,
ఓం మంత్రిణే నమః,
ఓం మంగళస్వరాయ నమః,
ఓం ప్రమధాయ నమః,
ఓం ప్రథమాయ నమః,
ఓం ప్రాజ్ఞాయ నమః,
ఓం విఘ్నకర్త్రే నమః,
ఓం విఘ్నహంత్రే నమః,
ఓం విశ్వనేత్రే నమః,
ఓం విరాట్పతయే నమః,
ఓం శ్రీపతయే నమః,
ఓం వాక్పతయే నమః,
ఓం శృంగారిణే నమః,
ఓం ఆశ్రితవత్సలాయ నమః,
ఓం శివప్రియాయ నమః,
ఓం శీఘ్రకారిణే నమః,
ఓం శాశ్వతాయ నమః,
ఓం బలాయ నమః,
ఓం బలోత్థితాయ నమః,
ఓం భవాత్మజాయ నమః,
ఓం పురాణపురుషాయ నమః,
ఓం పూష్ణే నమః,
ఓం పుష్కరోత్షిప్తవారిణే నమః,
ఓం అగ్రగణ్యాయ నమః,
ఓం అగ్రపూజ్యాయ నమః,
ఓం అగ్రగామినే నమః,
ఓం మంత్రకృతే నమః,
ఓం చామీకరప్రభాయ నమః,
ఓం సర్వస్మై నమః,
ఓం సర్వోపాస్యాయ నమః,
ఓం సర్వకర్త్రే నమః,
ఓం సర్వనేత్రే నమః,
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః,
ఓం సర్వసిద్ధియే నమః,
ఓం పంచహస్తాయ నమః,
ఓం పార్వతీనందనాయ నమః,
ఓం ప్రభవే నమః,
ఓం కుమారగురవే నమః,
ఓం అక్ష్యోభ్యాయ నమః,
ఓం కుంజరాసుర భంజనాయ నమః,
ఓం ప్రమోదాయ నమః,
ఓం మోదకప్రియాయ నమః,
ఓం కాంతిమతే నమః,
ఓం ధృతిమతే నమః,
ఓం కామినే నమః,
ఓం కపిత్థవనప్రియాయ నమః,
ఓం బ్రహ్మచారిణే నమః,
ఓం బ్రహ్మరూపిణే నమః,
ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః,
ఓం జిష్ణవే నమః,
ఓం విష్ణుప్రియాయ నమః,
ఓం భక్తజీవితాయ నమః,
ఓం జితమన్మథాయ నమః,
ఓం ఐశ్వర్యకారణాయ నమః,
ఓం జ్యాయసే నమః,
ఓం యక్షకిన్నర సేవితాయ నమః,
ఓం గంగాసుతాయ నమః,
ఓం గణాధీశాయ నమః,
ఓం గంభీరనినదాయ నమః,
ఓం వటవే నమః,
ఓం అభీష్టవరదాయ నమః,
ఓం జ్యోతిషే నమః,
ఓం భక్తనిథయే నమః,
ఓం భావగమ్యాయ నమః,
ఓం మంగళప్రదాయ నమః,
ఓం అవ్యక్తాయ నమః,
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః,
ఓం సత్యధర్మిణే నమః,
ఓం సఖయే నమః,
ఓం సరసాంబునిథయే నమః,
ఓం మహేశాయ నమః,
ఓం దివ్యాంగాయ నమః,
ఓం మణికింకిణీ మేఖలాయ నమః,
ఓం సమస్త దేవతామూర్తయే నమః,
ఓం సహిష్ణవే నమః,
ఓం సతతోత్థితాయ నమః,
ఓం విఘాతకారిణే నమః,
ఓం విశ్వగ్ధృశే నమః,
ఓం విశ్వరక్షాకృతే నమః,
ఓం కళ్యాణగురవే నమః,
ఓం ఉన్మత్తవేషాయ నమః,
ఓం పరాజితే నమః,
ఓం సమస్త జగదాధారాయ నమః,
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః,
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః,
ఓం విఘ్నేశ్వరాయ నమః,
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః అష్టోత్తర శతనామార్చనం సమర్పయామి.
ధూపం
శ్లో॥ దశాంగం గుగ్గు లోపేతం సుగన్ధిం సుమనోహరమ్
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ
ధూపమాఘ్రపయామి॥
(అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన వున్న స్టాండులో కాని, అరటి పండుకు కానీ గుచ్చాలి.)
దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపం దర్శయామి॥ (దీపాన్ని స్వామికి చూపించాలి)
నైవేద్యం
(కొబ్బరి కాయలు ఇంకా వుంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన బ్బరికాయను, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి)
సుగంధాన్ సుకృతాం శ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గ్యైః ప్రకల్పితాన్।
భక్ష్యం, భోజ్యంచ లేహ్యం చ చోష్యం పానీయ మేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక- మహానైవేద్యం సమర్పయామి॥
అంటూ ఆకుతో ఆ పదార్ధారన్నింటిపైన కొద్దిగా నీరు చల్లాలి. ఆ తరువాత స్వామికి నైవైద్యం పెట్టాలి.
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్,
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
తాంబూలం సమర్పయామి.
తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు వుంచి నమస్కరించాలి.
నీరాజనం
సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ,
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి॥
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి॥
(కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి, ఆ తరువాత హారతి పాత్రపై కొంచె నీటిని వుంచి కళ్ళకు అద్దుకోవాలి)
మంత్రపుష్పం
(పుష్పం, అక్షతలు తీసుకొని నిలుచొని ఈ శ్లోకాన్ని పఠించాలి)
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండః మహాకాయ కోటిశూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా
(అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి)
ప్రదక్షిణ
శ్లో॥ యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ।
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే ॥
పాపో హం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః ।
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప ॥
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥
(ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం)
ఆ తరువాత మరలా కూర్చొని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచె నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి.
యస్యస్మృత్యాచ నామోఖ్య తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణం తాం యాతి సద్వో వందే తం గణాధిపం
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహప్రభో
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి. ఆ నీటిని, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి.
పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై వుంచాలి. పెద్దలు కూడా ఆ అక్షతలు శిరసుపై ధరించాలి
EmoticonEmoticon