శ్రీ ఆదిశంకరులు రచించిన గ్రంథాల పేర్లు, స్థాపించిన మఠాల పేర్లు, స్థాపించిన లింగాల పేర్లు





ఆదిశంకరుడు రచించిన గ్రంథాలు - అధ్యాసభాష్యం, వివేకచూడామణి, ఉపదేశ సాహస్రి, సర్వ వేదాంతసిద్ధాంత సారసంగ్రహం, శివస్తోత్రాలు, శక్తిస్తోత్రాలు, విష్ణుస్తోత్రాలు, గణేశస్తోత్రాలు, యుగళ దేవతాస్తోత్రాలు, నదీతీర్థవిషయిక స్తోత్రాలు, సాధారణ స్తోత్రాలు, కనకధారా స్తోత్రమ్, నిర్వాణదశకమ్, మనీషా పంచకమ్, లక్ష్మీనరసింహ స్తోత్రమ్, హస్తామలక సంవాదస్తోత్రమ్, విష్ణు షట్పదీస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, బ్రహ్మతత్వమసి, హరిస్తుతి, జగన్నాధాష్టకమ్, పాండురంగాష్టకమ్, గణేశ పంచరత్నమ్, ఉమామహేశ్వర స్తోత్రమ్, కాశీపంచకమ్, పుష్కరాష్టకమ్, గంగాస్తోత్రమ్, హనుమత్ పంచరత్నమ్.





ఆదిశంకరుడు స్థాపించిన నాలుగు మఠాలు - తూర్పు దిక్కున జగన్నాథక్షేత్రమైన పూరీలో గోవర్ధనమఠాన్ని స్థాపించి, పీఠాధిపతిగా పద్మాపాదాచార్యులను నియమించారు. పశ్చిమదిక్కున ద్వారకలో కాళికాపీఠాన్ని నెలకొల్పి, పీఠాధిపతిగా హస్తామలకాచార్యుణ్ణి నియమించారు.  ఉత్తర దిక్కున బదరీక్షేత్రం ఓల జ్యోతిర్మఠాన్ని ఏర్పరచి, పీఠాధిపతిగా తోటకాచార్యుణ్ణి నియమించారు.

దక్షిణంలో శృంగేరి క్షేత్రంలో శారదాపీఠాన్ని ఏర్పరచి, పీఠాధిపతిగా సురేశ్వరాచార్యుణ్ణి నియమించారు. కంచి కామకోటి పీఠం కూడా ఆదిశంకరుల అద్వైతప్రచారానికి చాలా ముఖ్యమైందిగా చెప్పవచ్చు.

కైలాసం నుండి ఐదు స్ఫటిక లింగాలను తెచ్చి కేదారక్షేత్రంలో ఒకటి స్థాపించారు. ఆ లింగానికి ‘ముక్తిలింగమ’ని పేరు పెట్టారు. నేపాల్‌లోని నీలకంఠక్షేత్రంలో స్థాపించిన మరొక స్ఫటికలింగానికి ‘వరలింగమని’, చిదంబర క్షేత్రంలో స్థాపించిన మరో స్ఫటికలింగానికి ‘మోక్షలింగమని’, ‘శృంగేరిక్షేత్రంలో స్థాపించిన మరొక స్ఫటిక లింగానికి ‘భోగలింగమ’ని, కంచి క్షేత్రంలో స్థాపించిన మరొక స్ఫటిక లింగానికి ‘యోగలింగమని’ పేర్లు పెట్టడం జరిగింది.
Previous
Next Post »