సిజేరియన్ ఆపరేషన్ అయిన వారు ఎక్కువ సేపు పడుకోకుండా మెల్లగా పక్కకు తిరిగి కూర్చోవడం, లేచి నిలబడడం, నడవడం మంచిది. శరీర కదలికలు ఎంత బాగా ఉంటే త్రాబోసిస్ ఏర్పడకుండా సులభంగా నివారించవచ్చు. నడుం, కడుపు కండరాలు బలోపేతం అయేందుకు ప్రసవం అయిన 3-4వ రోజు వెల్లకిలా పడుకుని నడుం, కడుపు భాగం మంచంవైపు నుంచి శరీరంపై భాగం ప్రక్కకు తిప్పాలి. ఈ విధంగా 8-10 సార్లు చేయాలి.
రెండు వారం నుండి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. వెల్లకిలా పడుకుని మోకాళ్లు మడిచి పాదాలు మంచంపై ఆన్చాలి. మోకాళ్లు, తొడలు, పిరుదులు, నొక్కి పెట్టాలి. మలద్వారం ముడవాలి. ఈ విధంగా 5 సెకన్ల వరకు ఉండి రిలాక్స్ కావాలి. వెల్లకిలా పడుకుని ఒక మోకాలు మడవాలి. కడుపు కండరాలు బాగా లోపలికి లాక్కొని చాచి ఉన్న కాలుని కాళ్లవైపుకు బాగా చాచాలి. తిరిగి ఇది మడిచి రెండవ కాలుని చాచాలి. మరలా రిలాక్స్ అవ్వాలి. ఇలాగా 5-6 సార్లు చేయాలి.కూర్చుని మోచేతుల్ని మెకాళ్లపై ఉంచి ఊపిరి వదలాలి. జననేంద్రియం, అనస్‌ని లోపలికి ముడుచుకునేట్లు బిగపెట్టాలి. మూత్ర విసర్జన చేసే ముందు కొంత సేపు బిగబట్టడం వల్ల కడుపులోని గ్యాస్ వెళ్లిపోతుంది. ఈ విధంగా ఒకటి నుంచి మూడు సెన్ల వరకు చేసి రిలాక్స్ అవ్వాలి. కడుపుని ఎక్కువ సేపు లోపలికి ముడుచుకునేట్లు బిగపెట్టరాదు. పిరుదుల్ని కాని, కాళ్లని దగ్గరగా ఉంచి బిగపెట్టరాదు. బాలింతలకు ఇబ్బంది లేని విధంగా 5-6 సార్లు చేయాలి. కూర్చొని కాని, నిలబడి కాని, పడుకొని కాని చేయవచ్చు.
వెల్లకిలా పడుకొని నడుం భాగం పైకెత్తి ఇలా 30 సెకన్లు ఉంచాలి. మూత్రవిసర్జన, మలవిసర్జన చేసేటప్పుడు కొన్ని సెకన్లపాటు బిగపెట్టి వదలాలి. ఈ విధంగా 20,30 సార్లు చేయాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు మాత్రం చేయరాదు. వెల్లకిలా పడుకుని మోకాళ్లు మడిచి నడుం భాగాన్ని పైకెత్తి మెల్లగా కిందకు దించాలి. ఈ విధంగా చేసేటప్పుడు తొడలు, పిరుదులు, తుంటి, భుజాల్లో కొద్దిగా నొప్పిగా, బాధగా ఉంటుంది. ప్రారంభంలో కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ క్రమేణా చేయడం వల్ల బాధలు తగ్గుతాయి. నెల తర్వాత చేయాల్సిన ఎక్సర్ సైజ్‌లు- వెల్లకిలా పడుకుని మెకాళ్లు మడిచి ఛాతీవైపుకు తెచ్చి చేతులు బయటికి చాచి మోకాలుపై నుండి తిప్పి పక్కలకు అలర్ట్ చేయాలి. ఈ విధంగా 56 సార్లు చేయాలి.
ఎరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు, వార్మ్‌అప్, తేలికపాటి యోగాసనాలు వేయవచ్చు. బాలింతలకు అన్ని విధాలా సులభమైన ఎక్సర్‌సైజ్ వాకింగ్. నడక అన్ని విధాలా అందరికి మంచిది. రెండవ నెల నుండి పడుకొని చేతులు బయటికి చాచి కాలు పై ఒక్కొక్కసారి చేయి పైకెత్తి మోకాలు స్ట్రయిట్‌గా ఉంచి ఎదురుగా ఉన్న చేతిని తాకాలి. ఈ విధంగా 5-10 సార్లు చేయాలి. ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు – ప్రారంభంలో అసౌకర్యంగా, ఇబ్బంది లేకుండా మెల్లమెల్లగా చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకి రెండు మూడు సార్లు ఎక్సర్ సైజ్‌లు చేయాల్సి ఉంటుంది. సిజేరియన్ ఆపరేషన్స్, హైరిస్క్ గర్భిణీలు, బాలింతలు డాక్టర్ల సలహా ప్రకారం ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సి ఉంటుంది. మొదట్లో కడుపు, తొడలు, పిరుదుల్లో క్రాంప్స్, నొప్పులుండి క్రమేణా తగ్గుతాయి. ఎక్సర్‌సైజెస్ చేయడానికి ముందు బిడ్డకు పాలు తాగించాలి. బాలింతలు మూత్రవిసర్జన, మలవిసర్జన చేసిన తరువాత చేయాలి. ఇన్ఫెక్షన్స్, రక్తస్రావం, జ్వరం, నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం చేయరాదు. తగ్గిన తరువాతనే చేయాల్సి ఉంటుంది. ఇబ్బందిగా ఉన్నప్పుడు వాకింగ్, మసాజ్, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్‌లు వీలుని బట్టి చేయవచ్చు.
గర్భధారణ నుండి ప్రసవం అయిన మూడు నాలుగు నెలల వరకు ఎక్సర్ సైజ్‌లు చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరగడం వల్ల బాలింతల్లో కలిగే వేరికోజ్ వెయిన్స్, త్రాంబోసిస్ వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. బాడీ ఫిట్‌నెస్ వస్తుంది.
నీరసం, నొప్పులు తగ్గుతాయి. జీర్ణక్రియ బాగా జరిగి చక్కగా నిద్ర పడుతుంది. బిడ్డకు సరిపడే పాలు పడతాయి. బాలింతల్లో తగిన శక్తి త్వరగా కలగడం వల్ల త్వరగా ఇతర అనారోగ్యం సమస్యలు రాకుండా కోలుకుంటారు. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆక్టివ్‌గా ఉంటారు. కండరాల పటుత్వం వల్ల జాయింట్ పెయిన్స్ రావు. శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వల్ల మెటబాలిజమ్ వేగవంతమై బాలింతలు ఆరోగ్యంగా ఉంటారు.
EmoticonEmoticon