రామాయణంలో విభీషునుడి సౌశీల్యం ఎలాంటిది |
రామాయణంలో విభీషనుడిది ఉదాత్తమైన పాత్ర. తన అన్న రావణుడు చేసిన, చేస్తున్న దుశ్కర్మలు ధైర్యంగా ఎదిరించాడు. మంచి మాటలతో మార్చాలని చూశాడు. ఒకానొక సందర్భంలో రావణుని ఉద్దేశించి ‘మీరు అమిత బలవంతులు, పరాక్రమవంతులు. పైగా శివభక్తులు. ఎంతో విధేయత, విజ్ఞానం, అందం కల మండోదరి మహారాణి వారు మీ పట్టమహిషి. ఆమె పాతివ్రత్యానికి, భక్తికి ఎవరు సాటిరారు. కనుక నా మాట విని అంటూ ఆగిపోయాడు. ‘ఆగిపోయావేం చెప్పు హుంకరించాడు రావణుడు. లోపల భయం తొలుస్తున్నా ధైర్యంగానే ‘ మీరు చెరపట్టిన ఆ సీతాసాధ్విని తీసుకువెళ్లి గౌరవంగా రాముడికి అప్పగించండి. సీతామాతను సోదరిగా భావించండి. నా మాట వినండి. రాముడితో స్నేహం మన రాజనీతికి మంచిది అన్నాడు. ఆ మాట విని అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు రావణుడు. ‘ ఆ ..సీత .. నాకు సోదరా! వినడానికే కంపరంగా ఉంది. శూర్పణఖ ముక్కు, చెవ్ఞలు కోసినప్పుడు ఏమైనాయి నీ పలుకులు.
ఒక ఆడదాని ముక్కు, చెవ్ఞలు కోస్తున్నప్పుడు ఆ సీత అడ్డగించిందా! పైగా నాకే నీతులు చెబుతున్నావ్ఞ. సీతను చెరపట్టింది పరిణయం ఆడటానికే. రాజులకు అందం ఎప్పుడూ దాసోహమే. ఇక మరు వెళ్లవచ్చు అన్నాడు కోపంగా. విభీషణుడు నిట్టూర్పు విడిచి వెళుతూ ‘ నీ బాగుకోరి చెబుతున్నా పరస్త్రీ వ్యామోహం మంచిది కాదు. సీతమ్మ మహాసాధ్వి. పరమ పతివ్రత. స్త్రీని మోహించి రాజ్యాలే నాశనమైనాయి.
EmoticonEmoticon