అదే పని గా కూ ర్చో వ డం శరీరా నికి మంచిది కాదని మనం చాలాసార్లు వింటూఉంటాం. ఎక్కువ సమయం నిలుచోవడం మంచిది కాదని కూడా అంటున్నారు నిపుణులు. ప్రపంచంలోని సగం మందికి పైగా తమ పనిదినాలలో ఎక్కువ సేపు నిలుచునే పనిచేస్తున్నారని ఒక అంచనా.
ఒకప్పుడు మహిళలు ఏదైనా వండాలంటే కింద కూర్చుని పొయ్యి మీద చేసేవారు. ఇప్పుడు కూరగాయలు తరగడం, చపాతీలు చేయడం, కూరలు వండటం అన్నీ నిలుచునే చేస్తున్నారు. దీనికి గ్యాస్ పొయ్యి, సిలిండర్ కంటే తక్కువ ఎత్తులో ఉంచకూడదనే రక్షణ చర్యలు, మాడ్యులర్ కిచెన్‌ల ఏర్పాటు వంటివెన్నో తోడవుతున్నాయి. వంటింట్లోనే మహిళలు కనీసం గంటర్నర సమయం కేటాయిస్తారు. ఉద్యోగినులు బస్సులు, రైళ్లలో నిలుచునే ప్రయాణించాలి. దినచర్యలో భాగంగా కనీసం అయిదారు గంటలు గంటలైనా నిలుచోవాల్సిన పరిస్థితి.
ఇలా ఎక్కవ సేపు నిలుచుని పనిచేయడం వల్ల మహిళల్లో డిహైడ్రేషన్, వెరికోజ్‌వెయిన్స్, కాళ్లవాపులు, నడుమునొప్పి.. లాంటివి ఎదురవుతాయి. వెన్ను, పాదాలు, మడమల నొప్పులు బాధిస్తాయి. అరగంటకన్నా ఎక్కువ సేపు నిలబడితే శరీర భారమంతా కాళ్లపై పడుతుంది. ముఖ్యంగా లావుగా ఉన్నవారికి కాళ్లవాపులు త్వరగా వస్తాయి.
నిలబడి పనిచేయాల్సి వచ్చినపుడు ప్రతి అరగంటకోసారి భంగిమ మార్చుకోవడం మంచిది. నిటారుగా నిల్చోవాలి. నిలబడి పనిచేసేటప్పుడు రెండు కాళ్లను భుజాలకు సమాంతరంగా ఉంచాలి. మోకాళ్ల నొప్పులు రావు. రోజులో ఎక్కువ సేపు కదలకంఉడా కూర్చోవడమూ మంచిదికాదు. అదేపనిగా కూర్చుంటే పలు శారీరక, మానసిక అనారోగ్యాలు ఎదువుతాయంటున్నారు వైద్యులు. ఉద్యోగినులు కనీసం ఏడు గంటలు కూర్చున్న చోట కదలకుండా పనిచేస్తారు.
గృహిణులు టివిలకు అతుక్కుపోతారు. దీనివల్ల బరువు పెరగడం ఒకటే సమస్య అనుకుం టారు కానీ దాంతో అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గుండె సంబంధ వ్యాధులు, అండాశయ, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగి రక్తపోటు అధికం కావచ్చు.
ఎక్కువ గంటలు అదేపనిగా కూర్చుంటే భారమంతా వెన్నుపై పడుతుంది. మధు మేహం బారిన పడవచ్చు. మానసిక సమస్యలు చుట్టుముడతాయి. ఆఫీసులో ఎక్కువ గంటలు పనిచేసేవారు వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి. పాదాలు నేలకు తగిలేలా చూసుకోవాలి.
ప్రతి గంట కోసారైనా లేచి కాసుపు నడవడం తప్పనిసరి. సోఫాల్లో కూర్చుని గంటలు గంటలు ఫోన్లు, టివిలు చూసే అలవాటు మాను కోవాలి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. రోజూ కనీసం ఒక గంటైనా వ్యాయామం చేయాలి.
EmoticonEmoticon