కొన్ని మొక్కలు గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని గాలిని పరిశుభ్రం చేస్తాయి. వీటిని ఇండోర్ మొక్కలుగా పెంచుకుంటే, ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మీరు ఇప్పటికే ఇండోర్ గార్డెన్ నిర్వహిస్తున్నట్లయితే, తక్షణమే వీటికి మీ ఇంట్లో స్థానం కల్పించి కాలుష్యం లేని చక్కటి గాలితో ఆరోగ్యాన్ని పొందండి.
వీటిని సాధారణంగా మనం కుండీలలో పెంచుకోవచ్చు. బయట అనేక చోట్ల కనపడుతూనే వుంటాయి. సన్నని ఆకులు కలిగి పొడవుగా ఎదుగుతాయి. వీటిలో లేడీ పామ్, డ్వార్ఫ్ పామ్, బ్యాంబూ పామ్ అనే రకాలున్నాయి. ఏ రకమైనప్పటికి మంచిదే.
రబ్బరు ప్లాంట్
ఈ రకం మొక్క పొట్టిగా వుంటుంది. దీనిని కుండీలలో కూడా పెంచొచ్చు. దీని నుండి జిగురు తీస్తారు. మలినాలను తీసేయడానికి బాగా ఉపయోగ పడుతుంది. ఆకులు మందంగా వుండి దట్టమైన పచ్చని రంగులో వుంటాయి. అయితే దీని ఆకులు విషపూరితాలు కనుక వీటితో జాగ్రత్త పడాలి.
డ్రాసియానా
దీనినే జేనెట్ క్రెయింగ్ అని కూడా అంటారు. అనేక రకాల ఆకారలలో లభిస్తుంది. గుబురుగా పెరుగుతుంది. దీనిని కూడా కుండీలలో పెంచొచ్చు.
ఇంగ్లీష్ ఐవీ
మీరు ఆస్తమా రోగులైతే ఈ మొక్కను తప్పక పెంచాలి. కానీ ఇది చాలా విషపూరితమైనది కావున దీనిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి.
బోస్టన్ ఫెర్న్
ఇది చాలా పేరొందిన మొక్క. ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. ఇది ఇంట్లో ఉందంటే చాలు ఆరోగ్యం అందరికీ చేకూరినట్లే. ప్రత్యేకమైన ఈ ఇండోర్ మొక్కలను పెంచి మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రమైన గాలితో నింపి ఆరోగ్యాన్ని పొందండి.
EmoticonEmoticon